ఇటీవల ఇజ్రాయెల్‌పై పాలస్తీన్ ఉగ్రసంస్థ హమాస్ దాదాపు 5వేల రాకెట్లతో బాంబుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అనంతరం రంగంలోకి దిగిన ఇజ్రాయెల్.. హమాస్ నియంత్రణలో ఉన్న గాజా ప్రాంతంపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. అయితే ఈ విషయంలో కొన్ని దేశాలు ఇజ్రాయెల్‌కు మద్ధతు ప్రకటిస్తే.. మరికొన్ని పాలస్తీనాకు తమ మద్దతిస్తున్నాయి. ఇప్పటికీ ఈ ఇరుదేశాల మధ్య నెలకొన్న సంక్షోభానికి తెరపడలేదు. ఇప్పటికే ఈ భీకర యుద్ధ వాతావరణంలో వేలాది మంది పౌరులు మృతి చెందడం కలకలం రేపుతోంది. అలాగే తాజాగా గాజాలోని ఓ ఆసుపత్రిపై వైమానిక దాడి జరగడం.. అందులో దాదాపు 500 మంది మృతి చెందడం ప్రపంచ దేశాలు ఉలిక్కిపడేలా చేసింది. ఇదిలా ఉండగా.. శివసేన యూబీటీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ భారతీయ జనతా పార్టీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కాషాయ పార్టీని ఆయన ఉగ్రసంస్థ అయిన హమాస్‌తో పోల్చాడు.
పూర్తిగా చదవండి..Sanjay Raut: హమాస్ ఉగ్ర సంస్థతో బీజేపీని పోల్చిన శివసేన యూబీటీ నేత..
శివసేన యూబీటీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ భారతీయ జనతా పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాషాయ పార్టీని ఆయన ఉగ్రసంస్థ హమాస్‌తో పోల్చడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇజ్రాయెల్-హమాస్ వివాదం గురించి చేసిన వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందనకు కౌంటర్ ఇస్తూ సంజయ్ రౌత్ చేసిన విమర్శలు ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి.

Translate this News:











