Jagan Comments on Chandrababu: చంద్రబాబు పాలన చూస్తే కుప్పంలో కూడా ఆయన మావాడే అని చెప్పుకునే పరిస్థితి లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM Jagan) అన్నారు. కుప్పంలో ఒక్క పేదవాడికి కూడా చంద్రబాబు ఇంటి స్థలం ఇవ్వలేదని ఆరోపించారు. కానీ, మీ బిడ్డ జగన్ ప్రభుత్వం కుప్పంలో కొన్ని వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి.. ఇళ్ల నిర్మాణాలు చేపట్టిందన్నారు. ఈ రోజు ఎమ్మిగనూరులో జగనన్న చేదోడు పథకం (Jagananna Chedodu Scheme) నిధుల విడుదల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ.. గత పాలనకు ఇప్పటి పాలనకు తేడా గమనించాలని ఓటర్లను కోరారు. ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు వచ్చి చేరుతున్నాయన్నారు.
ఇది కూడా చదవండి: AP Cheddi Gang: కుప్పంను బెంబేలెత్తిస్తున్న చెడ్డీగ్యాంగ్.. హడలిపోతున్న నగర వాసులు
CM Jagan: చంద్రబాబు కుప్పంకు కూడా ఏం చేయలేదు.. అదో గజ దొంగల ముఠా: సీఎం జగన్
చంద్రబాబు అధికారంలో ఉండగా కుప్పంలో కూడా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయారని సీఎం జగన్ ధ్వజమెత్తారు. అప్పట్లో గజదొంగల ముఠా రాష్ట్రాన్ని దోచేసిందని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర వాఖ్యలు చేశారు. ఈ రోజు ఎమ్మిగనూరు పర్యటన సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర వాఖ్యలు చేశారు.

Translate this News:











