నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా… డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. అంటే ఏ పార్టీకి అయినా మిగిలి ఉన్న సమయం గట్టిగా 40 రోజులే. ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన అధికార పార్టీ బీఆర్ఎస్.. ప్రచారంలోనూ అందరికంటే ముందు దూసుకుపోతోంది. మరోవైపు రాహుల్, ప్రియాంక రాకతో కాంగ్రెస్ సైతం ప్రచార పర్వాన్ని స్టార్ట్ చేసింది. ఇక త్రిముఖ పోరుగా భావిస్తున్న ఎన్నికల్లో మూడో ప్రధాన పోటీదారుగా ఉన్న బీజేపీ సైతం అభ్యర్థుల లిస్ట్ ప్రకటించేందుకు రెడీ అయ్యింది. అదే సమయంలో తన మిత్ర పక్షం అయిన జనసేనతో చర్చలు జరుపుతోంది. తెలంగాణలో జనసేనతో కలిసి పోటీ చేసే అంశాన్ని మొన్నటిదాకా పెద్దగా సీరియస్‌గా పట్టించుకోని బీజేపీ.. జనసేన అధినేత దూకుడు పెంచడంతో అలర్ట్ అయ్యింది. తాజాగా టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో చర్చలు జరిపారు. ఈ భేటీలో తెలంగాణలో ఉమ్మడిగా పోటీ చేసే అవకాశాలపై చర్చించినట్లు జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: బీజేపీతో కలిసి పోటీ చేస్తారా లేదా మద్దతిచ్చి తప్పుకుంటారా.. పవన్ దారెటు..
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌తో కలిసి పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. తన కార్యాలయానికి విచ్చేసిన వీరిద్దరికి పవన్ కళ్యాణ్ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం జరిగిన చర్చల్లో జనసేన తెలంగాణ నేతలు తన వద్ద వెలిబుచ్చిన అభిప్రాయాలను పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలకు వివరించారు. ఈ మీటింగ్‌పై టీబీజేపీ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Translate this News:











