Pakistan International Airlines: పాకిస్థాన్(pakistan) రోజురోజుకూ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. నానాటికీ ఆ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారుతోంది. తాజాగా తీవ్ర ఇంధన కొరత కారణంగా విమాన సర్వీసులను కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది. 11 అంతర్జాతీయ, 13 దేశీ విమాన సర్వీసులను రద్దు చేసినట్టు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(pakistan international airlines) ప్రతినిధి ఒకరు తెలిపారు. మరో 12 విమానాల షెడ్యూల్స్ మార్చామని చెప్పారు. ప్రయాణికులు విమానాశ్రయాలకు వచ్చే ముందే పీఐఏ కస్టమర్ కేర్‌ను సంప్రదించి.. విమానం రద్దు కాలేదని తెలిస్తేనే రావాలని చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, బకాయిలు చెల్లించకపోవడంతో పీఐఏకు చమురు సంస్థలు ఇంధన సరఫరాను నిలిపివేశాయి.
పూర్తిగా చదవండి..మరింతగా దిగజారిన పాక్ ఆర్థిక పరిస్థితి..విమానాలు రద్దు..!!
పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. ఎంత అంటే.. ఇంధనం లేక విమానాలను రద్దు చేసుకుని పరిస్ధితికి వచ్చింది. రోజురోజుకూ పాక్ ఆర్థిక పరిస్ధితి మరింతగా దిగజారుతోంది. బకాయిలు చెల్లించకపోవడంతో పీఐఏకు ఇంధన సరఫరా నిలిపివేశారు. మరోవైపు రుణభారం పెరిగిపోతుండటంతో పీఐఏను ప్రైవేటు పరం చేయాలనే చర్చ కూడా జరుగుతోంది. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి రోజువారీ ఖర్చుల కోసం రూ. 23 బిలియన్ల సాయాన్ని అందించాలని ప్రభుత్వాన్ని పీఐఏ కోరినట్లు తెలుస్తోంది.

Translate this News:











