బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రోజుకు రెండు నియోజవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఈ రోజు జడ్చర్లలో జరిగిన పబ్లిక్ మీటింగ్ కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు వస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జై భీమ్ అని అన్నారు. లక్ష్మారెడ్డిని మరో సారి గెలిపించాలని జడ్చర్ల నియోజకవర్గ ఓటర్లను కోరారు కేసీఆర్. ఉద్యమ సమయంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఏ మూలకు పోయిన ఏడుపు వచ్చేదన్నారు. నేడు స్వరాష్ట్రంలో ఆ పరిస్థితి మారిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రొ.జయశంకర్ చెప్పినందుకు మహబూబ్ నగర్ నుంచి తాను గతంలో ఎంపీగా పోటీ చేశానన్నారు. నేను మహబూబ్ నగర్ ఎంపీ గా ఉంటూనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కీర్తి చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నడిగడ్డకు వెళ్ళినప్పుడు ఒక ఊర్లో ఏడ్చానని గుర్తు చేసుకున్నారు కేసీఆర్. ఉద్యమంలో పక్కన కృష్ణమ్మ ఉన్నా.. లభమేమి లేకపాయే అనే పాటను తానే రాశానన్నారు.
ఇది కూడా చదవండి: TS BJP First List: 37 మందితో బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఇదే.. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్
KCR: కాంగ్రెస్ వస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జై భీమ్: సీఎం కేసీఆర్
కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 24 గంటల కరెంట్ పోయి 3 గంటల కరెంట్ వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ రోజు జడ్చర్లలో జరిగిన ఎన్నికల సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. మరో సారి బీఆర్ఎస్ ను గెలిపించాలని ఓటర్లను కోరారు. కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధు, దళితబంధు పథకాలు ఆగిపోతాయన్నారు.

Translate this News:











