టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ వన్డే ర్యాంకుల్లో దూసుకుపోయాడు.వన్డే వరల్డ్ కప్ తో తొలి మూడు మ్యాచ్ ల్లో సత్తా చాటిన రోహిత్ మరోసారి టాప్ 10లోకి దూసుకొచ్చాడు. ఏకంగా 5 స్థానాలు ఎగబాకి 6వ ర్యాంక్ లో నిలిచాడు. గతవారం టాప్ 10 నుంచి పడిపోయిన హిట్ మ్యాన్ మళ్లీ పుంజుకుని తన ర్యాంక్ ను మెరుగుపరుచుకున్నాడు. అఫ్గానిస్థాన్ తో జరిగి మ్యాచ్ లో సెంచరీ(131)తో పాటు పాకిస్థాన్ తో జరిగి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ (86)తో అదరగొట్టాడు.
పూర్తిగా చదవండి..Cricket:ర్యాంకులను ప్రకటించిన ఐసీసీ..టాప్ 10లో భారత్ ఆటగాళ్ళు
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. టీమ్ ఇండియా ఆటగాళ్ళల్లో రోహిత్ శర్మ సత్తా చాటాడు. ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో ర్యాంకుకు చేరుకున్నాడు హిట్ మ్యాన్. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో రోహిత్ రెండు మ్యాచ్ లలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

Translate this News:











