Volunteer Raped Minor Girl: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ మధ్య ఏపీ వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వాలంటీర్ల కేసులు, వాలంటీర్ల వేధింపులు అంటూ చాలా ఆరోపణలు వచ్చాయి. అలాంటి ఘటన మళ్లీ ఇప్పుడు వాలంటీర్ రేప్ కేసు అంటూ కలకలం రేపుతోంది. పవన్ చెప్పినట్టే ఇంట్లో ఎవరు లేని టైంలో ఆధార్ కార్డ్ కోసం వెళ్లి ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు అదే గ్రామానికి చెందిన వాలంటీర్ నీలాపు శివకుమార్. ఆ తర్వాత పలుమార్లు బాలికను బెదిరించి అదేపని చేశాడు.. ఆ బాలిక గర్భవతి కావడంతో వ్యవహారం బయటకు వచ్చింది. తప్పించుకోవాలని చూసినా శివకుమార్ గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టడంతో చివరకు పెళ్లికి ఒప్పుకున్నాడు. తీరా పెళ్లి ముందు రోజు వాలంటీర్ పరారయ్యాడు. తాజాగా ఈ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లా దెందులూరులో వెలుగులోకి చోటుచేసుకుంది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శివకుమార్ ఊరు వదిలి పారిపోయాడు.
పూర్తిగా చదవండి..Ap Volunteer: బాలికపై వాలంటీర్ దాష్టీకం..ఆధార్ కావాలంటూ ఇంట్లోకి వెళ్లి అఘాయిత్యం
ఏపీలో వాలంటీర్ల ఆకృత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి . ఇప్పటికే అనేక మంది జీవితాలను పలువురు వలంటీర్లు నాశనం చేయగా.. ఇంకొందరు హత్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో బాలిక జీవితాన్ని వలంటీర్ నాశనం చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆధార్ కార్డు కావాలంటూ ఆ బాలిక ఇంటికి వెళ్లిన ఈ దారుణానికి ఒడిగట్టాడు.

Translate this News:











