PVR INOX Multiplex Monthly Subscription Pass: గతంలో ఏదైనా సినిమా(Cinema) విడుదల అవుతుందంటే చాలు.. కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా థియేటర్‌కు(Movie Theatre) వెళ్లి సినిమా చూసి వచ్చేశారు. జస్ట్ వంద రూపాయాల్లో ఫ్యామిలీ మొత్తం సినిమా చూసి వచ్చేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడంతా మల్టీప్లెక్స్‌లుగా మారిపోయాయి థియేటర్లు. ఖర్చులు కూడా భారీగా పెరిగిపోయాయి. సినిమా టికెట్ల రేట్స్ కూడా భారీగా పెరిగిపోయాయి. ఒక వ్యక్తి సినిమా థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే.. కనీసం రూ. 500 చేతిలో ఉండాల్సిందే. ఇక ఫ్యామిలీతో వెళ్తే రూ. 3 వేలకు పైగానే ఖర్చు అవుతుంది. అందుకే.. చాలా మంది ఇంత డబ్బు పెట్టి సినిమా చూడాలా? అని ఆలోచిస్తుంటారు. ఇంట్లోనే ఓటిటి ప్లాట్ఫామ్లో చూస్తుంటారు. ఫలితంగా థియేటర్లకు వచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది.
పూర్తిగా చదవండి..Bumper Offer: రూ. 699తో మల్టీప్లెక్స్ థియేటర్లో నెల మొత్తం సినిమాలు చూడొచ్చు.. కండీషన్స్ అప్లై..
ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షించేందుకు PVR ఐనాక్స్ అదిరిపోయే పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా భారీ నెట్వర్క్ కలిగిన ఉన్న PVR ఐనాక్స్ సంస్థ సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. మొట్టమొదటిసారిగా ఇన్-థియేటర్ మూవీ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఇది నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్. దీని ద్వారా మీరు థియేటర్ మూవీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు.

Translate this News:











