దసరా నేపథ్యంలో సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది తెలంగాణ ఆర్టీసీ (TSRTC). ప్రయాణికుల సౌకర్యం కోసం జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) మీదుగా విజయవాడకు బస్సులను నడపాలని నిర్ణయించింది. బీహెచ్ఈఎల్/మియాపూర్ నుంచి బయలుదేరే 24 సర్వీసులను ఎంజీబీఎస్ నుంచి కాకుండా జేబీఎస్ మీదుగా నడపనున్నట్లు ప్రకటించింది. ఆ సర్వీసులు కేపీహెచ్ బీ కాలనీ, బాలానగర్, బోయిన్ పల్లి, జేబీఎస్, సంగీత్ (పుష్పక్ పాయింట్), తార్నాక (పుష్పక్ పాయింట్), హబ్సిగూడ (పుష్పక్ పాయింట్), ఉప్పల్ (పుష్పక్ పాయింట్) , ఎల్బీనగర్ మీదుగా విజయవాడకు (Vijayawada) నడుస్తాయని ఆర్టీసీ తెలిపింది.
ఇది కూడా చదవండి: TSRTC: టీఎస్ఆర్టీసీ గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్.. పండుగల వేళ మరిన్ని ట్రిప్పులు..
TSRTC: హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. ఆర్టీసీ కీలక ప్రకటన
హైదరాబాద్ నుంచి విజయవాడకు రాకపోకలు సాగించే వారికి తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యం కోసం జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) మీదుగా విజయవాడకు బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది.

Translate this News:











