Allu Arjun at 69th National Film Awards Ceremony: భారతీయ సినిమా వందేళ్లు పైబడిన హిస్టరీలో, 90ఏళ్ల చరిత్ర టాలీవుడ్ (Tollywood) కి ఉంది. తొమ్మిది దశాబ్ధాల్లో టాలీవుడ్ ఎందరో సూపర్ స్టార్లను పరిచయం చేసింది. కానీ, వీళ్లలో ఎవరూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ (National Award) అందుకోలేదు. ఢిల్లీ ప్రభుత్వం నుంచి ఎవరికీ ఆ గౌరవం దక్కలేదు. ఒకప్పుడు భారతీయ సినిమా అంటే హిందీ చలన చిత్రసీమ అని భావించేవారు. అసలు సౌత్ ఇండస్ట్రీలకు ఒక గుర్తింపు అన్నదే లేదు. పైగా ఇక్కడి స్టార్లను వారంతా చులకనగా చూసేవారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) స్వయంగా అనుభవించి మరీ ఆవేదన చెందారు. మన లెజెండరీ నటులు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్ వంటి వారికి దిల్లీ లైబ్రరీలో గౌరవం దక్కలేదని తెలిపారు. వారి ఫోటోలను కనీసం దిల్లీ సినిమా లైబ్రరీలో ఉంచలేదని అన్నారు.
పూర్తిగా చదవండి..Allu Arjun: అసలు సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఇదే..!!
భారతీయ సినీచరిత్రలో తెలుగు సినిమా ఉన్నంత కాలం గుర్తుండిపోయేలా.. బన్ని ఇప్పుడు జాతీయ ఉత్తమ నటుడిగా తొలి పురస్కారాన్ని తెలుగు లోగిళ్లలోకి తెస్తున్నాడు. దశాబ్ధాల ఘనచరిత కలిగి ఉన్న టాలీవుడ్ కి ఉత్తమ నటుడిగా తొలి జాతీయ అవార్డును అందుకుంటున్నాడు. నేడు దిల్లీలో జరగనున్న జాతీయ అవార్డుల కార్యక్రమంలో, అల్లు అర్జున్ జాతీయ పురస్కార ట్రోఫీని అందుకోనున్నాడు. దీనికోసం భార్య స్నేహారెడ్డితో కలిసి అల్లు అర్జున్ దిల్లీకి బయల్దేరిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

Translate this News:


















