Israel -Hamas War: ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న పోరు పదో రోజుకు చేరుకుంది. తమపై దాడి చేసిన గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకర యుద్ధం ప్రకటించింది. దీంతో గాజా నగరం కుప్పకూలుతోంది. ఇజ్రాయెల్ దాడిలో గాజాలో ఇప్పటి వరకు 2,750 మంది ప్రాణాలు కోల్పోయారని, 9,700 మంది గాయాలపాలయ్యారని స్థానిక ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొదట్లో ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసిన హమాస్ దాదాపు 200 మందిని బందీలుగా పట్టుకుంది. ఈ కారణంగానే ఇజ్రాయెల్ గాజాపై భీకర దాడి చేస్తోంది.
పూర్తిగా చదవండి..ఊచకోత కోస్తున్న హమాస్ కు ఇజ్రాయెల్ మహిళ సపోర్ట్.. షాకింగ్ వీడియో వైరల్..!!
‘నన్ను విడిపించండి ప్లీజ్’.. హమాస్ చెరలో బందీగా ఉన్న ఓ ఇజ్రాయెల్ మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆమె చేతికి కట్టు కన్పించింది. తీవ్ర గాయంతో బాధపడుతూ కన్పించింది ఆ మహిళ. ప్రస్తుతానికి తాను బాగానే ఉన్నానని చెప్పింది. అయితే, వీలైంనంత త్వరగా తనను హమాస్ చెరలో నుంచి విడిపించాలని ఇజ్రాయెల్ సర్కార్ ను వేడుకుంది. కాగా, కేవలం ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచేందుకు హమాస్ మిలిటరీ విభాగమైన ఇజ్ అద్-దిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ ఈ వీడియోను టెలిగ్రామ్‌లో విడుదల చేసినట్లు తెలుస్తోంది.

Translate this News:











