తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసే విషయంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదనీ, బరాబర్ పోటీ చేసి తీరతామని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో ఆయన మాట్లాడారు. గెలుపే లక్ష్యంగా మొత్తం 87 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించామని, ఇప్పటికే బలమైన అభ్యర్థులను సిద్ధం చేశామని పేర్కొన్నారు. చంద్రబాబు ఆమోదముద్ర వేయగానే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామన్నారు. అభ్యర్థుల పేర్లతో పాటు మేనిఫెస్టో కూడా విడుదల చేస్తామన్నారు.
పూర్తిగా చదవండి..87 స్థానాల్లో పోటీ.. చంద్రబాబు ఆమోదించగానే జాబితా ప్రకటిస్తాం- కాసాని జ్ఞానేశ్వర్
87 స్థానాల్లో పోటీ చేస్తామని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చెప్పారు. బలమైన అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. లిస్ట్ రెడీ అయ్యిందని చంద్రబాబు ఆమోదించగానే జాబితా ప్రకటిస్తామని తెలిపారు. మేనిఫెస్టోలో బీసీలకు పెద్దపీట వేస్తామని.. యువతకు ప్రాధ్యాన్యం కల్పిస్తామన్నారు కాసాని.

Translate this News:











