World Cup 2023 – Eng vs Afg : ఆఫ్ఘన్ క్రికెట్ చరిత్రలో అద్భుతం జరిగింది. ఒక పెద్ద టీమ్ ను ఓడించి మేము పిల్ల బ్యాచ్ కాదని నిరూపించుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ను ఓడించి మరీ తమ సత్తా ఏమిటో నిరూపించుకుంది. నిన్న జరిగిన ఇంగ్లాండ్ (England), ఆఫ్ఘాన్ (Afghanistan) మ్యాచ్ లో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ఆఫ్ఘనిస్థాన్ జట్టులో మొదట బ్యాటర్లు రాణించగా.. ఆ తర్వాత బౌలర్లు సక్సెస్ అయ్యారు. ఇంగ్లండ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ ఆ జట్టును 215 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో ఆఫ్ఘన్ జట్టు 69 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ నమోదు చేసింది. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రహమాన్ (Mujeeb Ur Rahman) 3, రషీద్ ఖాన్ (Rashid Khan)3 వికెట్లు, నబీ 2 వికెట్లు పడగొట్టారు.
పూర్తిగా చదవండి..WORLD CUP 2023:వీళ్ళు మామూలోళ్ళు కాదు…ఏకంగా ఇంగ్లాండ్ నే ఓడించేశారు.
వరల్డ్ కప్ టోర్నీలో సంచలనం నమోదు అయ్యింది. డిఫెండింగ్ ఛాంపియన్ ను ఓడించిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు చరిత్ర సృష్టించింది. మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన ఆఫ్ఘన్.. మూడో మ్యాచ్ లో ఏకంగా ఇంగ్లండ్ టీమ్ నే మట్టికరిపించింది. మమ్మల్ని తేలిగ్గా తీసుకోవద్దంటూ ఒక హెచ్చరికను జారీ చేసింది.

Translate this News:











