తెలంగాణలో ఎన్నికల సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ఇప్పటికే బీఆర్ఎస్ తన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించగా.. ఇప్పుడు కాంగ్రెస్(Congress) ఆ పని చేయనుంది. 58 మందికి కూడిన ఫస్ట్ లిస్ట్‌ని కాంగ్రెస్ ఇవాళ విడుదల చేయనుంది. నిన్న ఢిల్లీ సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలోని ఏఐసిసి కేంద్ర ఎన్నికల కమిటీ ఈ పేర్లను ఆమోదించింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు అక్టోబర్ 17 లేదా 18న మరోసారి ఏఐసిసి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుందని తెలుస్తోంది. అక్టోబర్ 19 నాటికి మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే ప్లాన్‌లో ఉంది కాంగ్రెస్. మరోవైపు RTV చేతిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్ల జాబితా ఉంది. హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుంచి పద్మావతి, నల్లగొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, నరికేకల్ నుంచి వేముల వీరేశం లాంటి వారు ఈ లిస్ట్‌లో ఉన్నారు.
మరిన్ని వివరాల కోసం కింద లింక్ చేసిన ఆర్టీవీ(RTV) వీడియో చూడండి.
TS Congress: 58 మందితో లిస్ట్.. RTV చేతిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు.. ఫైనల్ జాబితా ఇదే..!
ఆర్టీవీ(RTV) చేతిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్ల జాబితా ఉంది. ఇవాళ(అక్టోబర్ 15) 58 మందికి కూడిన ఫస్ట్ లిస్ట్‌ని కాంగ్రెస్ రిలీజ్ చేయనుంది. అక్టోబర్ 19 నాటికి మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే ప్లాన్‌లో ఉంది కాంగ్రెస్. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.

Translate this News:











