వరల్డ్‌కప్(World cup) సాధించడం చాలా మంది క్రికెటర్ల కల. కొన్ని జట్లకు అది ఇప్పటికీ కలే. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు దాదాపు ప్రతిసారి టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగానే బరిలోకి దిగుతుంటాయి. ఈ రెండు జట్లలో స్టార్లకు అసలు ఢోకా ఉండదు. మ్యాచ్ విన్నర్లు ఎక్కువగా ఉన్న టీమ్‌లు ఇవి. అయితే ప్రతీసారి వారికి నిరాశే ఎదురవుతుంది. 2019 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ చివరి మెట్టుపై బోల్తా పడింది. అంపైర్ చేసిన చిన్న పొరపాటు న్యూజిలాండ్‌కు కప్ దూరం చేసింది. అయితే ఇదంతా క్రికెట్లో భాగమేనంటూ ఎంతో స్పొరిటివ్గా తీసుకున్న ప్లేయర్, న్యూజిలాండ్ కెప్టెన్కేన్ విలియమ్ సన్(Williamson). మనవాళ్లు ముద్దుగా కేన్ మావా అని పిలిచుకుంటారు. గత ప్రపంచ కప్‌లో లాస్ట్‌లో చేజారిన అవకాశాన్ని ఈ సారి చేజారనివ్వకూడదని, భారత్ గడ్డపై ప్రపంచకప్ సాధించాలని ఇండియాలో అడుగుపెట్టాడు విలయమ్సన్. అయితే అతనికి ప్రస్తుతం కలిసిరావడం లేదని అర్థమవుతుంది.
పూర్తిగా చదవండి..World cup 2023: ఆ జట్టుకు భారీ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ దూరం.. ఇలా అయితే కష్టమే..!
ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన న్యూజిలాండ్ ఏ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. మూడింటిలోనూ గెలిచింది. కచ్చితంగా సెమీస్‌కి వెళ్లే జట్లలో న్యూజిలాండ్ ఉంటుందని అంతా భావిస్తున్న సమయంలో ఆ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. గాయంలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ తర్వాతి జరగబోయే మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడంలేదని సమాచారం.

Translate this News:












