Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలైపోయింది. ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘం.. ఎలక్షన్ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 30న రాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్ మరింత దూకుడు పెంచింది. అయితే ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్.. 115 నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. నర్సాపూర్, జనగామ, గోషామహల్, నాంపల్లి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇటీవలే మల్కాజ్గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.. తన కుమారుడికి టికెట్ ఇవ్వలేదనే కారణంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు సీఎం కేసీఆర్ 5 నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15న ఆయన తెలంగాణ భవన్లో మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. అదే రోజు అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేయనున్నారు. మరోవైపు పలు నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు తమ గళం విప్పుతునే ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల అభ్యర్థిత్వాన్ని పునః పరిశీలించాలని పార్టీ అధినేత ముందుకు తమ అభిప్రాయాన్ని తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు.
పూర్తిగా చదవండి..Telangana: రేపే పార్టీ అభ్యర్థులకు బీ ఫామ్లు పంపిణీ.. పదిమంది అభ్యర్థులకు కేసీఆర్ షాక్ ?
ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్.. 115 నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. నర్సాపూర్, జనగామ, గోషామహల్, నాంపల్లి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇటీవలే మల్కాజ్గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.. తన కుమారుడికి టికెట్ ఇవ్వలేదనే కారణంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు సీఎం కేసీఆర్ 5 నియోజకవర్గాలకు తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15న ఆయన తెలంగాణ భవన్లో మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. అదే రోజు అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేయనున్నారు.

Translate this News:











