గాజాపై భూ దాడికి సిద్ధమైంది ఇజ్రాయెల్. దీనికి సంబంధించి 11 లక్షల మంది పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్ డెడ్‌లైన్ ఇచ్చింది. 24 గంటల్లో దక్షిణ దిశకు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే గాజాకు నిత్యావసరాల సరఫరాను ఇజ్రాయెల్ నిలిపేసింది. ఇప్పటివరకు వైమానిక దాడులకు మాత్రమే పరిమితమైన ఇజ్రాయెల్ సైన్యం ఇప్పుడు భూతల యుద్ధానికి సన్నద్ధమవుతోంది. గాజాలో అడుగుపెట్టి ప్రతీ ఇంటినీ గాలించి మిలిటెంట్లను ఏరిపారేయాలని అనుకుంటోంది. పాలస్తీనా మిలిటెటంట్లను సమూలంగా నాశనం చేయడమే లక్ష్యంగా కదులుతోంది.
పూర్తిగా చదవండి..ISREAL WAR: భూతల యుద్ధానికి రెడీ అయిన ఇజ్రాయెల్
హమాస్ టార్గెట్‌గా గాజాపై ఇజ్రాయెల్ ముప్పేట దాడి చేయాలని డిసైడ్ అయింది. గాజాను నేలమట్టం చేసేందుకు భారీ ఆపరేషన్‌కు ప్లాన్ చేస్తోంది. ఇప్పటివరకు వైమానిక దాడికి మాత్రమే పరిమితమైన ఇజ్రాయెల్ ఇప్పుడు భూమార్గంలో కూడా దాడులకు పాల్పడాలని అనుకుంటోంది.

Translate this News:











