Operation Ajay: ఆపరేషన్ అజయ్ కింద భారత పౌరుల మొదటి విమానం శుక్రవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగింది. తొలి విమానంలో 212 మంది భారతీయులను ఇజ్రాయెల్ (Israel) నుంచి సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. ఇజ్రాయెల్ నుంచి తిరిగి వస్తున్న భారతీయులకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (Rajeev Chandrasekhar) స్వాగతం పలికారు. మన ప్రభుత్వం ఏ భారతీయుడిని వదిలిపెట్టదని కేంద్రమంత్రి అన్నారు. వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి మా ప్రభుత్వం, మన ప్రధాని కట్టుబడి ఉన్నారు.విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ (S JaiShankar), ఆయన బృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని కేంద్ర మంత్రి అన్నారు. ప్రజలను సురక్షితంగా భారత్కు తీసుకువచ్చినందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఎయిర్ ఇండియా విమాన సిబ్బందికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
పూర్తిగా చదవండి..Operation Ajay: ఇజ్రాయెల్ నుంచి 212 మంది పౌరులతో ఢిల్లీకి చేరిన మొదటి విమానం..!!
ఆపరేషన్ అజయ్ కింద భారత పౌరుల తొలి విమానం శుక్రవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. తొలి విమానంలో 212 మంది భారతీయులను ఇజ్రాయెల్ నుంచి సురక్షితంగా తీసుకొచ్చారు. ఆపరేషన్ అజయ్ కింద, యుద్ధం మధ్య ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయ పౌరులను సురక్షితంగా తిరిగి తీసుకువస్తున్నారు. ఈ ఆపరేషన్ గురువారం అర్థరాత్రి ప్రారంభమైంది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇజ్రాయెల్ లో చిక్కుకున్న భారతీయులు సురక్షితంగా ఇండియాకు తీసుకురానున్నారు.

Translate this News:











