Telangana Elections: తెలంగాణలో మరో 50 రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో ప్రధాన పార్టీలు ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలుపొందాలని భావిస్తున్నాయి. ఇందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. సాధారణంగా ఎన్నికలంటేనే.. డబ్బుతో పని ఉంటుంది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నాయకులు, అభ్యర్థులు పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేస్తుంటారు. భారీ స్థాయిలో డబ్బు పంపిణీ చేస్తారు. నగదు, ఆభరణాలు, చీరలు, వస్తువులు.. ఇలా ఏది పడితే అది పంపకాలు చేపడతారు. అయితే, ఈసారి అలాంటి పప్పులుడకవ్ అంటోంది ఎన్నికల సంఘం. ఈ మేరకు ఎక్కడికక్కడ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దరిమిలా.. ఎన్నికల కోడ్ కూడా రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. ఈ నెల 9వ తేదీ నుంచి మోడల్ కోడ్ అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. రూ. 50 వేల కంటే ఎక్కువ డబ్బు, ఇతర సామాగ్రిని తరలిస్తున్నట్లయితే లెక్కలు చూపాల్సిందే. లేదంటే.. ఆ డబ్బు, సామాగ్రి అన్నీ సీజ్ చేసేస్తారు అధికారులు.
పూర్తిగా చదవండి..Telangana Elections: లైన్ దాటితే వేటే.. పార్టీలకు ఈసీ ఆదేశాలు!
ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులకే కీలక సూచనలు చేసింది ఎన్నికల సంఘం. ఒక్కొక్క అభ్యర్థి గరిష్టంగా రూ. 40 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలని స్పష్టం చేసింది. అదనంగా ఖర్చు చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని.. సెక్షన్ 123(6) ప్రకారం అవినీతికి పాల్పడినట్లు కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించింది.

Translate this News:











