Eluru: ఏలూరులో మహిళపై యాసిడ్ దాడికి తెగబడిన కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. ఏలూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎం.సునీల్‌కుమార్ సంచలన తీర్పు వెలువరించారు. యాసిడ్ దాడిలో (Acid Attack) ప్రాణాలు కోల్పోయిన ఎడ్ల ఫ్రాన్సికా కుటుంబానికి సత్వర న్యాయం అందిస్తూ ముగ్గురు నిందితులకు శిక్ష ఖరారు చేశారు. ఏలూరు జిల్లాలో 35 ఏళ్ల మహిళపై యాసిడ్ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు నిందితులు బోడ నాగ సతీష్, బెహరా మోహనం, ఉషా కిరణ్‌లను దోషులుగా నిర్దారించిన వారికి జీవిత ఖైదు విధిస్తూ బుధవారం (నేడు) తీర్పు వెలువరించింది. నేడు జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఏలూరు కొత్తగూడెం ప్రాంతానికి చెందిన ప్రధాన నిందితుడు బోడ నాగసతీకు జీవిత ఖైదుతోపాటు రూ.10 వేల జరిమానా, బెహరా మోహన్, బూడిద ఉషాకిరణ్‌కు జీవిత ఖైదుతోపాటు రూ.15 వేల చొప్పున జరిమానా విధించారు. యాసిడ్ విక్రయించిన కొల్లా త్రివిక్రమరావుకు రూ.1,500 జరిమానా విధించారు.
పూర్తిగా చదవండి..AP News: ఆ ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు.. ఏపీ కోర్టులో సంచలన తీర్పు
ఏలూరులో మహిళపై యాసిడ్ దాడికి తెగబడిన కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. ఏలూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎం.సునీల్‌కుమార్ సంచలన తీర్పు వెలువరించారు.

Translate this News:











