లతీఫ్ భారత్ కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. పఠాన్ కోట్ లో జరిగిన దాడికి లతీఫే కారణం. ఇతన్ని పట్టుకోవడానికి మన ప్రభుత్వం ఎప్పటి నుంచో ట్రై చేస్తోంది. పంజాబ్లోని సియాల్ కోట్ లో నూర్ మదీనా మసీద్ లోని ప్రార్ధన చేసి బయటకొస్తుండగా బైక్ మీద వచ్చిన ముగ్గురు దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో లతీఫ్ తో పాటూ మరో ఉగ్రవాది కూడా అక్కడిక్కడే మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. లతీఫ్ ను చంపిన వెంటనే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దీని మీద పాక్ పోలీసులు దర్యప్తు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..TERRORIST KILLED:పఠాన్ కోట్ దాడి సూత్రధారి లతీఫ్ ఖాన్ హతం
భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, పఠాన్ కోట్ దాడి సూత్రధారి జైషే మహ్మద్ టాప్ కమాండర్ షాహిద్ లతీఫ్ ను పాకిస్తాన్ లో చంపేశారు. పంజాబ్ లోని సియాకోట్ లో అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

Translate this News:











