ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రికెట్ ఫీవర్ నడుస్తోంది. వరల్డ్ కప్(World cup) కావడంతో అందరి చూపు క్రికెట్‌వైపు మళ్లింది. చాలా మందికి చిన్నప్పుడు క్రికెటర్ కావాలన్న కల ఉంటుంది. ప్రస్తుత జనరేషన్లో కోహ్లీ, రోహిత్‌ని చూసి చాలా మంది క్రికెటర్ కావాలని కలలు కంటున్నారు. 90s కిడ్స్ సచిన్‌ని చూసి బ్యాట్ పట్టుకోవాలని గ్రౌండ్లోకి బూస్ట్ తాగి దిగేవాళ్లు. అయితే చాలామంది చిన్నతనం నుంచి టీనెజ్కి వచ్చేవరకు అసలు క్రికెటర్ అవ్వడానికి ప్రొసెస్ ఏంటన్నది తెలియదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది. సిటీల్లో అంటే ఇప్పుడు వందల్లో కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. విలేజ్ వాళ్లకి మాత్రం ఈ విషయాలపై అవగాహన తక్కువ. చివరికి ఏజ్ పెరిగిపోయిన తర్వాత క్రికెటర్ కాలేకపోయాం అని బాధపడుతుంటారు. అయితే క్రికెటర్ అవ్వలేకపోయినా ఈ గేమ్‌పై పట్టు ఉంటే వేరే రకంగా మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తూ అదే సమయంలో డబ్బులు సంపాదించవచ్చు.
పూర్తిగా చదవండి..World cup 2023: పని మూడు గంటలు.. జీతం రూ.2లక్షలు.. క్రికెట్ తెలిస్తే చాలు..!
క్రికెట్ అంపైర్లుకు ఇటివలీ కాలంలో జీతాలు ఎక్కువగానే పెరిగాయి. ముఖ్యంగా ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్‌కు రూ. 1.98 లక్షల ఫీజ్ అందుకుంటారు ఎలైట్ అంపైర్లు. ఇక ఇండియాలో అంపైర్ అవ్వాలంటే బీసీసీఐ పెట్టే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. లెవల్ 1, లెవెల్ 2 రెండు పరీక్షలను క్లియర్ చేయాలి. అభ్యర్థులు తప్పనిసరిగా మెడికల్ టెస్ట్‌కు హాజరు కావాలి.

Translate this News:












