Bathukamma: తెలంగాణా (Telangana)లో ప్రత్యేకంగా జరుపుకునే పండగ బతుకమ్మ. ఈ పండగ తెలంగాణ ఆడ బిడ్డలకు ఎంతో ప్రత్యేకమైన పండగ. బతుకమ్మ అంటేనే పువ్వుల పండగ తెలంగాణ ప్రజలు బతుకమ్మను పువ్వులతో అలంకరించి ఎంతో ఘనంగా జరుపుకుంటారు. గునుగు, తంగేడు, అడవి చేమంతి, కట్లపూలు, గడ్డి పూలు ఇలా రకరకాల పూలతో బతుకమ్మను పూజిస్తారు 9 రోజుల పాటు జరుపుకునే ఈ పండగకు రోజు ఒక ప్రత్యేకత ఉంది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ , రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిది వెన్నె ముద్దల, తొమ్మిది సద్దల బతుకమ్మ.
పూర్తిగా చదవండి..Bathukamma 2023 Songs: దుమ్ములేపుతున్న బతుకమ్మ పాటలు..! మొదలైన బతుకమ్మ సంబరాలు..
ప్రస్తుతం బతుకమ్మ పండగ సందర్బంగా బతుకమ్మ పాటల సందడి మొదలైంది. ఇక ఈ సంవత్సరం బతుకమ్మ పై పాడిన పాటలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక బతుకమ్మ పండుగకు దుమ్మురేపుతున్న బతుకమ్మ పాటలు ఇవే..

Translate this News:











