కుక్కలను కూడా వదలడంలేదు. వాటిపై ఏం పగ ఉందో తెలియదు.. కాల్చి కాల్చి చంపుతున్నారు. విశ్వాసంగా మూగజీవాలు కదా.. అందుకే ఈ క్రూరత్వం.. అవునులే.. చిన్నారులనే వదిలపెట్టని మూర్ఖులు కుక్కలపై జాలీ చూపిస్తారా? పరిగెత్తుకోని వస్తున్న కుక్కను కాల్చి చంపకుండా ఉంటారా? చేతిలో గన్ ఉంటే ఇంకేం ఆగుతారు.. బలహీనులపై ప్రతాపం చూపడం బలవంతుల లక్షణం కదా.. ఇజ్రాయెల్(Israel)- పాలస్తీనా(palestine) మధ్య జరుగుతున్న యుద్ధంలో హమాస్ తీవ్రవాదుల చేస్తున్న దారుణాలను కొన్ని మీడియా సంస్థలు బయటపెడుతున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ అఫిషియల్ సోషల్మీడియా హ్యాండిల్స్ హమాస్(Hamas) రాక్షసత్వాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ అకౌంట్ నుంచి ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇది పూర్తిగా హింసతో కూడిన వీడియో. అందుకే డిస్క్లేయిమర్ కూడా వేశారు.
పూర్తిగా చదవండి..Israel vs Hamas: రక్తదాహం.. హమాస్ తీవ్రవాదుల పైశాచికత్వాన్ని కళ్లకు కట్టే వీడియో..!
హమాస్ తీవ్రవాదులు పైశాచికత్వాన్ని కళ్లకు కట్టే వీడియోలను ఇజ్రాయెల్ సోషల్మీడియా హ్యాండిల్స్ బయటపెడుతున్నాయి. తాజాగా ఓ కుక్క చనిపోయే వరకు హమాస్ మిలిటెంట్ కాల్చి చంపిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కుక్కను చంపిన తర్వాత అక్కడ నుంచి ఇంటిలోకి ఎంట్రీ ఇచ్చిన హమాస్ తీవ్రవాది లైటర్ ఆన్ చేసి ఇంటిని మొత్తం తగలపెట్టాడు.

Translate this News:











