Sarala Kumari: సిక్కిం రాష్ట్రంలో ఇటీవల కుంభవృష్టి వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ వరదల్లో 14 మంది మృతి చెందగా.. మరో 26 మంది గాయపడ్డారు. 22 మంది జవాన్లు సహా మొత్తం 102 మంది గల్లంతైయ్యారు. అయితే, ఆ వరదల్లో ప్రముఖ సీనియర్ నటి సరళ కుమారి గల్లంతైనట్టు తెలిసింది. దానవీరశూరకర్ణ, సంఘర్షణ వంటి చిత్రాల్లో నటించిన ఆమె.. ఇటీవల స్నేహితులతో కలిసి సిక్కిం పర్యటనకు వెళ్లారు. ఆ రాష్ట్రంలో వచ్చిన ఆకస్మిక వరదల తర్వాత ఆమె ఆచూకీ గల్లంతైంది. తల్లి ఆచూకీ లేకపోవడంపై అమెరికాలో ఉంటున్న ఆమె కుమార్తె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..ప్లీజ్..మా అమ్మ ఆచూకీ కనిపెట్టండి..! సీనియర్ నటి కూతురి ఆవేదన..!
ప్రముఖ సీనియర్ నటి సరళ కుమారి ఇటీవలి సిక్కిం వరదల్లో గల్లంతైనట్టు తెలిసింది. అమ్మ ఆచూకీని గుర్తించాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఆమె కుమార్తె నబిత. దయచేసి అమ్మ ఎక్కడ ఉందో ఆచూకీ కనుక్కోవాలని కోరారు. సరళ కుమారి ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ 'దాన వీర శూర కర్ణ'లో నటించారు. సంఘర్షణ తదితర సినిమాల్లోనూ నటించారు.

Translate this News:











