శ్రీకాళహస్తి పట్టణంలోని 4 మద్యం దుకాణాల్లో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో మద్యం షాపులో 3 లక్షల నుంచి 6 లక్షల వరకు నగదు, మద్యం బాటిళ్లు గోల్ మాల్ జరిగినట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. అవకతవకలు జరిగిన దుకాణంలో పని చేసే సిబ్బందిని ఎక్సైజ్ ఎస్సై విచారిస్తున్నారు. విచారణలో అవకతవకలకు సహకరించిన పలువురు ఎక్సైజ్ అధికారుల పేర్లు దుకాణంలో పనేచేసే సిబ్బంది వెల్లడించారు. తీగ లాగితే డొంక కదిలిన వైనంలో గతంలో జరిగిన అవినీతి కూడా బట్టబయలు అయింది. పట్టణంలోని చెంచులక్ష్మి కాలనీలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణంలో రూ.55 లక్షలు మేర డబ్బును షాప్లో పనిచేసే ఇందు కుమార్ అనే ఉద్యోగి కాజేశాడు.
పూర్తిగా చదవండి..AP Liquor: మద్యం కోసం సిబ్బంది అతి తెలివి.. నివ్వెరపోయిన అధికారులు
శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో గోల్ మాల్ అయ్యాయి. తప్పుడు లెక్కలు చూపించి దుకాణంలో పనీచేసే ప్రభుత్వ ఉద్యోగస్తులు మద్యం బాటిళ్లు మాయం చేశారు. రహస్య సమాచారంతో మద్యం షాపులపై ఎక్సైజ్ శాఖ పోలీసు అధికారులు దాడులు నిర్వహించారు. విస్తు పోయే నిజాలు వెలుగు చూసిన వైనం.. ఎక్సైజ్ శాఖ ఉన్నత అధికారులే దోచుకు తింటున్న వైనం.

Translate this News:











