ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ, పిటిషన్ల మీద వాదనలు సుదీర్ఘంగా జరుగుతూనే ఉన్నాయి. రెండు రోజులుగా ఇవి కొనసాగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం కోర్టు మరోసారి వీటిని విననుంది. చంద్రబాబు తరుఫున ప్రమోద్‌కుమార్ దూబే వాదిస్తుండగా సీఐడీ తరుఫున అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ఏఏజి అమలుకావాలని చెప్పారు. ఇరువురు వాదనల అనంతరం నేడు తీర్పును వెలువరించే అవకాశం ఉంది.ఇప్పటికే చంద్రబాబు రిమాండ్‌ను అక్టోబర్19 వరకు పొడిగిస్తూ మరోసారి నిన్న ఎసిబి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈరోజుతో చంద్ర బాబు బెయిల్ ,కస్టడీ పిటిషన్ లపై స్పష్టత రానుంది.
పూర్తిగా చదవండి..CHANDRABABU CASE HEARING:నేడు కూడా ఏసీబీకోర్టులో కొనసాగనున్న వాదనలు
చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లపై ఎసిబి కోర్టులో నేడు కూడా వాదనలు కొనసాగనున్నాయి.స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో బెయిల్ , కస్టడీ పిటిషన్ లపై రెండు రోజులుగా ఎసిబి కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. నేడు మధ్యాహ్నం 12గంటల నుంచి 1:30 వరకు చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించనున్నారు.

Translate this News:











