ప్రధాని మోదీ (PM Modi) ఈ రోజు తెలంగాణ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ పై (CM KCR) సంచలన వాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో మోదీ చేసిన వాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ఈ వాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) స్పందించారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఉన్నది ఫెవికాల్ బంధమన్న విషయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ సాక్షిగా మరోసారి స్పష్టం చేశారని అన్నారు. వారిద్దరు చీకటి మిత్రులు, ఢిల్లీలో దోస్తీ – గల్లీలో కుస్తీ అని తాము మొదటి నుండి చెబుతున్నదే నిజం అని మోదీ మాటల ద్వారా సుస్పష్టంగా తేలిందన్నారు. ‘కేసీఆర్ ఎన్డీయేలో చేరాలనుకున్నది నిజం… మోదీ ఆశీస్సులతో కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలనుకున్నది నిజం.. ఇప్పటికీ మోడీ – కేసీఆర్ చీకటి మిత్రులే అన్నది పచ్చి నిజం.’ అని అన్నారు రేవంత్ రెడ్డి.
ఇది కూడా చదవండి: PM Modi vs CM KCR: ఎన్డీఏలోకి వస్తానంటే వద్దన్నా.. కేటీఆర్ ను ఆశీర్వదించమంటే నో చెప్పా.. కేసీఆర్ టాప్ సీక్రెట్స్ రివీల్ చేసిన మోదీ
Revanth Reddy: మోదీ చెప్పిన విషయాన్ని మేం ఎప్పుడో చెప్పాం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న రేవంత్
తెలంగాణలో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ఉన్నది ఫెవికాల్ బంధమన్న విషయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ సాక్షిగా మరోసారి స్పష్టం చేశారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వారిద్దరు చీకటి మిత్రులు, ఢిల్లీలో దోస్తీ – గల్లీలో కుస్తీ అని తాము మొదటి నుండి చెబుతున్నదే నిజం అని మోదీ మాటల ద్వారా సుస్పష్టంగా తేలిందన్నారు.

Translate this News:











