ఏ ముహూర్తాన వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ వేశారో కానీ టీమిండియాకు ఒక్కటి కూడా కలసిరావడంలేదు. మొన్న ఇంగ్లండ్‌తో జరగాల్సిన ప్రాక్టిస్ మ్యాచ్ వర్షార్పణం అవ్వగా.. మరోసారి అదే జరిగింది. నెదర్లాండ్స్‌తో మ్యాచ్ కూడా వర్షానికి రద్దయింది. కనీసం టాస్ కూడా పడలేదు. కేరళ(Kerala)లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. మరోసారి వరుణుడిదే పైచేయిగా మారింది. రాజధాని తిరువనంతపురంలో వాతావరణం మరోసారి క్రికెట్‌ను బీట్ చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా నేటి వార్మప్ మ్యాచ్(Warmup match) ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. భారత్ రెండు మ్యాచ్‌లు ప్రతికూల వాతావరణానికి గురయ్యాయి. ఇప్పుడు టీమిండియా నేరుగా చెన్నైకి వెళ్తుంది. అక్కడ ఈ నెల 8న తమ ప్రారంభ ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇక ఈ నెల 6న హైదరాబాద్‌లో జరిగే పాకిస్థాన్ మ్యాచ్‌పై నెదర్లాండ్స్ దృష్టి సారించనుంది. ఈ నెల 5న 2019 ప్రపంచకప్ ఫైనలిస్టుల నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్‌తో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది.
పూర్తిగా చదవండి..World cup 2023: ఈ మాత్రం దానికి వార్మప్ మ్యాచ్‌లు ఎందుకు? మరో గేమ్ కూడా ఫసక్..!
టీమిండియా ఆడాల్సిన మరో వార్మప్ మ్యాచ్ కూడా రద్దయింది. టాస్ కూడా వేయకుండానే వర్షం కారణంగా మ్యాచ్‌ని క్యాన్సిల్ చేశారు. గత శనివారం గువాహటిలో ఇంగ్లండ్‌పై జరగాల్సిన ప్రాక్టీస్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా బంతి కూడా పడలేదు. ఇప్పుడు కేరళ-తిరువనంతపురం మ్యాచ్‌కు కూడా వరుణుడు అడ్డుపడ్డాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 8న ఆస్ట్రేలియాతో మ్యాచ్‌తో టీమిండియా తన 2023 వరల్డ్‌కప్ ప్రస్థానాన్ని ప్రారంభించనుంది.

Translate this News:











