కేంద్ర ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సారథ్యంలో 17మంది అధికారుల బృందం హైదరాబాద్ కు చేరుకోనున్నారు. తాజ్ కృష్ణ హోటల్లో బస చేయనున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ లో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశాలు నిర్వహించనుంది. ఇవాళ మధ్యాహ్నం 2.30 నుండి 4.30 వరకు గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలతో సమావేశం జరుగుతంది. తర్వాత సాయంత్రం 5 గంటల నుండి 7.30 గంటల వరకు పలు ఎన్ఫోర్స్ మెంట్ ఏజెన్సీలతో రివ్యూ, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, అధికారుల ప్రెజెంటేషన్ ఉంటుంది.
పూర్తిగా చదవండి..central election commission:నేడు హైదరాబాద్ కి కేంద్ర ఎన్నికల బృందం.
తెలంగాణకు ఎన్నికల ఫీవర్ స్టార్ట్ అయింది. దీన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ మరింత పెంచనుంది. కేంద్ర ఎలక్షన్ కమిషన్ అధికారులు ఈరోజు నుంచి 3 రోజుల పాటూ తెలంగానలో పర్యటించనున్నారు. ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు, సన్నద్ధత మీద ఎన్నికల అధికారులు, సంస్థలతో సమీక్షించనున్నారు.

Translate this News:













