A Dhawan-less ODI World Cup! : పెద్ద టోర్నిల్లో టీమిండియాకు కొండంత అండ టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్(Shikar Dhawan). ఒకప్పుడు టీమిండియాకు ఓపెనర్‌గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ధావన్ ప్రస్తుతం టీమ్ నుంచి వేటుకు గురయ్యాడు. చాలా కాలంగా ధావన్ లేకుండానే ఇండియా మ్యాచ్‌లు ఆడుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్‌లో అనేక రికార్డులు సృష్టించిన ధావన్ ఈ మెగా టోర్నికి దూరంకావడం అభిమానులను బాధ పెడుతోంది. ఎవరూ ఔనన్నా కాదన్నా పెద్ద టోర్నమెంట్లలో ధావన్ ఆట తీరు అద్భుతం. మిగిలిన మ్యాచ్‌ల్లో ధావన్ ఎలా ఆడుతాడదన్నది పక్కన పెడితే బిగ్ మ్యాచ్‌లో మాత్రం టీమిండియా తోపు అతనే.
మ్యాన్ ఆఫ్ బిగ్ మ్యాచస్:
ఇప్పటివరకు ఆడిన పది ప్రపంచకప్ మ్యాచుల్లో ధావన్ మూడు సెంచరీలతో 53 సగటుతో 537 పరుగులు చేశాడు. కేవలం రెండు మ్యాచ్‌ల తర్వాత 2019 ఎడిషన్ నుంచి నిష్క్రమించిన ఈ స్టార్ ప్లేయర్..ఆస్ట్రేలియాపై మ్యాచ్ విన్నింగ్ సెంచరీతో మరోసారి టీమ్‌లోకి దూసుకొచ్చాడు వచ్చాడు. రెండు సార్లు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అందుకున్న ఘనత ధానవ్ది. 2010లో వన్డేల్లో అరంగేట్రం చేసిన ధావన్ తక్కువ టైమ్‌లోనే టీమిండియాలో ప్రధాన ప్లేయర్‌గా మారిపోయాడు. 2013 మార్చిలో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అరంగేట్రం చేసిన ధావన్ మిచెల్ స్టార్క్, పీటర్ సిడిల్, నాథన్ లియాన్, జేవియర్ డోహెర్టీలతో కూడిన జట్టుపై 174 బంతుల్లోనే 187 రన్స్ చేశాడు. ఇందులో 33 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. మొహాలీలో భారత్‌ను ఆరు వికెట్ల తేడాతో గెలిపించాడు.
World cup 2023: ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించిన మొనగాడు..కానీ ఇప్పుడు ప్చ్.. ఈ తోపు లేకుండానే వరల్డ్‌కప్!
బిగ్ మ్యాచ్‌ల్లో టీమిండియాకు మ్యాచ్ విన్నర్‌గా పేరొందిన భారత్ స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెరీర్ దాదాపు ముగిసినట్టే కనిపిస్తోంది. నిజానికి 2019 ప్రపంచకప్‌లోనూ గాయంకారణంగా ఈ మెగా టోర్నికి దూరంగా ఉన్న ధావన్ ఈ సారి మాత్రం ఫామ్‌లేక, గిల్ దూకుడిని తట్టుకోలేక జట్టుకు దూరం అయ్యాడు. అటు భారత్ జట్టు అభిమానులకు పెద్ద టోర్నమెంట్ అనగానే ధావనే గుర్తొస్తాడు. ఈసారి మాత్రం ధావన్ లేకుండానే టీమిండియా స్వదేశంలో వరల్డ్‌కప్ ఆడనుంది.

Translate this News:












