Tamil Nadu BJP chief snaps at reporter: తమిళనాడు బీజేపీ చీఫ్ నోటి దురద మరోసారి బయటపడింది. నోటికి వచ్చింది మాట్లాడుతూ నిత్యం వివాదాల్లో ఉండే అన్నామలై మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ఓ ప్రశ్న అడిగిన మహిళా విలేకరి పట్ల అన్నామలై(Annamalai) ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కాకపోతే బీజేపీలోనే కొనసాగుతారా అని అన్నామలైను ప్రశ్నించగా.. ఆ ప్రశ్న ఎవరు అడిగారో అందరికీ అర్థమయ్యేలా తన పక్కనే నిల్చోవాలని వెటకారంగా మాట్లాడారు. “వచ్చి నా పక్కన నిలబడు. నన్ను అలాంటి ప్రశ్న ఎవరు అడిగారో టీవీ ద్వారా ప్రజలను చూడనివ్వండి. ప్రశ్నలు అడగడానికి ఒక మార్గం ఉంది. ఇంత తెలివైన ప్రశ్న అడిగిన వ్యక్తి ఎవరో ఎనిమిది కోట్ల మంది ప్రజలకు తెలియాలి’ అని బీజేపీ నేత వ్యాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..BJP chief vs Reporter: ‘వచ్చి నా పక్కన నిలబడు, నీ ముఖం చూపించు’.. మహిళా రిపోర్టర్‌పై బీజేపీ చీఫ్ చిందులు..!
భారతీయ జనతా పార్టీ (BJP) తమిళనాడు అధ్యక్షుడు కె అన్నామలై విలేకరులతో వ్యవహరించిన తీరుపై మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి వైదొలగితే బీజేపీలో కొనసాగుతారా అని ఓ మహిళా విలేకరి అతడిని ప్రశ్నించారు. దీనిపై అన్నామలై స్పందిస్తూ.. 'రండి అక్కా, ఇక్కడి నుంచి వచ్చి మాట్లాడండి. ఇలాంటి ప్రశ్నలు ఎవరు అడుగుతున్నారో తమిళనాడు ప్రజలు చూడాలి' అంటూ వెటకారంగా మాట్లాడారు.

Translate this News:











