Aditya-L1 Sun Mission updates: ఆదిత్య-ఎల్1 ప్రయోగంలో మరో కీలక ఘట్టం పూర్తయ్యింది. లక్ష్యం దిశగా దూసుకెళ్తున్న ఈ ఉపగ్రహం భూమి నుంచి 9.2 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, భూమి గురుత్వాకర్షణ శక్తి పరిధిని దాటింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం ప్రకటించింది. ఆదిత్య ఎల్-1 సూర్యుడు-భూమి మధ్యలో లాగ్రాంజ్ పాయింట్ 1(ఎల్1)వైపు తన మార్గంలో ప్రయాణిస్తోందని ఇస్రో ప్రకటించింది. ఈ ప్రయోగంలో ఇది కీలక మైలురాయి అని పేర్కొంది ఇస్రో. అయితే, భూ గురుత్వాకర్షణ శక్తికి అవతల అంతరిక్ష నౌకను పంపడం ఇది వరుసగా రెండవసారి. మొదటిసారి మార్స్ ఆర్బిటల్ మిషన్లో ఈ ప్రయోగం చేశారు.
పూర్తిగా చదవండి..Aditya-L1 Sun Mission update: భూమి గురుత్వాకర్షణ పరిధిని పరిధిని దాటేసిన ఆదిత్య ఎల్-1.. కీలక అప్డేట్ ఇచ్చిన ఇస్రో..
ఆదిత్య-ఎల్1 ప్రయోగంలో మరో కీలక ఘట్టం పూర్తయ్యింది. లక్ష్యం దిశగా దూసుకెళ్తున్న ఈ ఉపగ్రహం భూమి నుంచి 9.2 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, భూమి గురుత్వాకర్షణ శక్తి పరిధిని దాటింది. ఈ విషయాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం ప్రకటించింది.

Translate this News:











