కాంగ్రెస్ కు షర్మిల ఇచ్చిన గడువు ఈరోజుతో ముగుస్తోంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని షర్మిల అడిగారు. సెప్టెంబర్ 30లోపు ఏదోకటి తేల్చాలని చెప్పారు. కానీ ఆ విలీనానికి బ్రేక్ పడినట్టే అనిపిస్తోంది. మొన్నటి వరకు ఇదిగో విలీనం అదిగో విలీనం అంటూ కబుర్లు చెప్పిన వైఎస్ఆర్టీపీ వర్గీయులు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. రీసెంట్ గా లోటస్ పాండ్ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో పార్టీ అధినేత్రి షర్మిల చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఒంటరి పోరు తప్పదని…తమ పార్టీ అభ్యర్ధులు 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని షర్మిల ప్రకటించింది.
పూర్తిగా చదవండి..YS Sharmila:షర్మిలకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. రాజన్న బిడ్డ నెక్ట్స్ స్టెప్ ఏంటి?
కాంగ్రెస్ పార్టీ షర్మిలను లైట్ తీసుకుందా? పార్టీ విలీనానికి నో చెప్పిందా...అంటే అవుననే తెలుస్తోంది. ఈనెల 30 అంటే ఈరోజు వరకే కాంగ్రెస్ కు డెడ్ లైన్ ఇచ్చింది షర్మిల. కానీ ఇప్పటి వరకు ఆపార్టీ ఏం విషయం తేల్చలేదు. దీంతో షర్మిల నెక్ట్స్ స్టెప్ ఏంటా అని డిస్కషన్స్ నడుస్తున్నాయి.

Translate this News:











