Telangana Congress BC Leaders: ప్రతిపార్లమెంటుకు రెండు సీట్లు ఇవ్వవలసిందే అని తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) లో బీసీ నేతలు(BC Leaders) కోరుతున్నారు. ఈ మేరకు అధిష్ఠానంపై గట్టిగా ఒత్తిడి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో, బీసీనేతలు నేరుగా ఢిల్లీ వెళ్లి అధిష్టానానికి తమ వాదన వినిపించారు. తెలంగాణ కాంగ్రెస్ లోని బీసీ ముఖ్యనేతలు కొందరు శుక్రవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రేని కలిశారు. జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు 34 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధిష్టానాన్ని కలిసిన వారిలో మధు యాష్కీ, పొన్నం ప్రభాకర్, పొన్నాల లక్ష్మయ్య, కత్తి వెంకటస్వామిలు ఉన్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లా బీసీలకు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..Telangana Congress: ప్రతి పార్లమెంట్‌కు రెండు సీట్లు ఇవ్వాల్సిందే.. కాంగ్రెస్‌కు బీసీ నేతల డిమాండ్..
ప్రతిపార్లమెంటుకు రెండు సీట్లు ఇవ్వవలసిందే అని తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) లో బీసీ నేతలు(BC Leaders) కోరుతున్నారు. ఈ మేరకు అధిష్ఠానంపై గట్టిగా ఒత్తిడి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో, బీసీనేతలు నేరుగా ఢిల్లీ వెళ్లి అధిష్టానానికి తమ వాదన వినిపించారు.

Translate this News:











