ఏపీ హైకోర్టులో చంద్రబాబు మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కావాలని లంచ్ మోషన్ పిటిషన్ను చంద్రబాబు తరపు న్యాయవాదులు వేశారు. దీన్ని మధ్యాహ్నం విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు నారా లోకేష్ కూడా హైకోర్ట్ లో లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ ను నారా లోకేష్ దాఖలు చేశారు.ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు ఈ రోజు ఉదయం డిస్పోజ్ చేసింది. విచారణకు సహకరించాలని లోకేష్ ను ఆదేశించింది. లోకేష్ కు 41 ఏ నోటీస్ ఇవ్వమని అధికారులను ఆదేశించింది. 41 ఏ నోటీసు ఇస్తామని కోర్టుకు ఏజీ శ్రీరామ్ తెలిపారు. ఏపీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా ఉన్న నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు ఢిల్లీ బయలుదేరారు. ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్, కేసుల విషయంలో ఆయన న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు.
పూర్తిగా చదవండి..chandrababu:ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు
ఏపీ హైకోర్టులో చంద్రబాబు మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కావాలని లంచ్ మోషన్ పిటిషన్ను చంద్రబాబు తరపు న్యాయవాదులు వేశారు. దీన్ని మధ్యాహ్నం విచారించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Translate this News:











