ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్ఎస్ స్వామినాథన్ నేడు ఉదయం 11.30గంటలకు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 98 సంవత్సరాలు. వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకురావాలని ఆకాంక్షించిన స్వామినాథన్.. తుదిశ్వాస వరకూ అందుకోసమే కృషి చేశారు. స్వామినాథన్‌కు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలన్న డిమాండ్‌ని తెరపైకి తీసుకురావడంతో పాటు అందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి. ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎంతో కృషి చేశారు. అంతేకాదు.. అధిక దిగుబడినిచ్చే వరి రకాలను అభివృద్ధి చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఇది భారతదేశంలోని తక్కువ-ఆదాయ రైతులు ఎక్కువ దిగుబడిని ఉత్పత్తి చేయడానికి సహాయపడింది. 1925 ఆగష్టు 7వ తేదీన జన్మించిన ఎమ్ఎస్ స్వామినాథన్ పద్మశ్రీ, పద్మ విభూషణ్, రామన్ మెగసెసె వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.
పూర్తిగా చదవండి..MS Swaminathan: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్ఎస్ స్వామినాథన్ కన్నుమూత
భారత వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్ర నిపుణుడు, హరిత విప్లవ పితామహుడు ఎమ్ఎస్ స్వామినాథన్(98) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

Translate this News:











