హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం (Ganesh Nimajjanam 2023) వేడుకలు హైదరాబాద్ మహానగరంలో వైభవంగా సాగుతున్నాయి. మహాగణపతి శోభాయాత్ర సైతం ప్రారంభమైంది. మరో వైపు ఇప్పటికే ట్యాంక్ బండ్ కు భారీగా వినాయకుడి విగ్రహాలు చేరుకుంటున్నాయి. హైదరాబాద్ లో మొత్తం లక్ష విగ్రహాలు నేడు నిమజ్జనం కానుండగా.. కేవలం హుస్సేన్ సాగర్ లోనే 30 వేలకు పైగా గణేశ్ ప్రతిమల నిమజ్జనం సాగనుంది. ఓల్డ్ సిటీ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఘనంగా కొనసాగే మహాశోభయాత్రను తిలకించేందుకు భక్తులు భారీగా తరలి రానున్నారు. రేపు ఉదయం వరకు ఈ శోభాయాత్ర కొనసాగనుంది. రాత్రి పూట కనుల పండువగా సాగే శోభాయాత్రను చూడడానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే అదిరిపోయే శుభవార్త చెప్పింది. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ రోజు రాత్రి 11 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు స్పెషల్ సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Ganesh Nimajjanam 2023: గణేశ్ నిమజ్జనం స్పెషల్.. రాత్రంతా ఎంఎంటీఎస్ ట్రైన్లు.. టైమింగ్స్ ఇవే!
హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనానికి వెళ్లాలనుకుంటున్న భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. రేపు ఉదయం 4.40 గంటల వరకు స్పెషల్ సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

Translate this News:











