Singareni Elections Schedule: సింగరేణిసంస్థలో ఎన్నికల నగారా మోగింది. కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర కార్మిక శాఖ సింగరేణి సంస్థకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 28వ తేదీన ఎన్నికలు నిర్వహించి, అదే రోజున ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 6,7 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 9వ తేదీ వరకు అవకాశం కల్పించారు. 10వ తేదీన నామినేషన్ల స్క్రూటిని ఉంటుంది. ఇదే రోజున సింబల్స్ కేటాయిస్తారు. ఇకపోతే.. సెప్టెంబర్ 30వ తేదీన డ్రాఫ్ట్ ఓటర్స్ లిస్ట్‌ను అధికారులు పంపిణీ చేస్తారు. ఓటర్ లిస్ట్‌పై ఏమైనా అభ్యంతరాలుంటే.. అక్టోబర్ 3వ తేదీ లోపు ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులకు తెలియజేయాలి. 4వ తేదీన వచ్చిన అభ్యంతరాలపై రిటర్నింగ్ అధికారులు తుది నిర్ణయం తీసుకుంటారు. 5వ తేదీన ఫైనల్ ఓటర్స్ లిస్ట్‌ను ప్రదర్శిస్తారు. అక్టోబర్ 28న పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలు ప్రకటిస్తారు అధికారులు.
పూర్తిగా చదవండి..Singareni Elections: సింగరేణి సంస్థలో మోగిన ఎన్నికల నగారా.. షెడ్యూల్ వివరాలివే..
సింగరేణి సంస్థలో ఎన్నికల నగారా మోగింది. కేంద్ర కార్మిక శాఖ సింగరేని సంస్థకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 28వ తేదీన ఎన్నికలు నిర్వహించి, అదే రోజున ఫలితాలు వెల్లడించనున్నారు.

Translate this News:












