Etela Rajender: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR), మంత్రి కేటీఆర్(Minister KTR)పై బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్(Etela Rajender) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తున్న తీరును చూసి తెలంగాణ(Telangana) సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని అన్నారు. అక్టోబర్ 1వ తేదీన మహబూబ్‌నగర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సభ జరుగనుంది. ఈ సభ ఏర్పాట్లను ఈటల రాజేందర్ ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం, మంత్రిపై ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీపై గతంలో వారు చేసిన సానుకూల వ్యాఖ్యలను, ఇప్పుడు చేస్తున్న వ్యతిరేక వ్యాఖ్యలను ఉదహరిస్తూ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ సాక్షిగా ప్రధాని మోదీని సీఎం కేసీఆర్ పొగిడారని గుర్తు చేశారు. ‘ఇప్పుడు తిడుతున్న ఇదే కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రధాని అంటే ఒక వ్యక్తి కాదు వ్యవస్థ అని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ప్రధాని గురించి చిన్నగా మాట్లాడినప్పుడు దేశ ప్రధాని గౌరవించుకోవాల్సిన సంస్కారం మన మీద ఉంది అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే ఈ ప్రాజెక్టులను నిర్మించుకోగలుగుతున్నామని చెప్పారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ప్రధానిపై విమర్శలు చేస్తున్నారు? ఏ మొహం పెట్టుకుని వస్తున్నారని ప్రధానిని కేటీఆర్ అంటున్నారంటే వీరికి సంస్కారం ఉందా? లేదా? తెలంగాణ ప్రజలు ఆలోచించరా? కేంద్ర ప్రభుత్వ అండదండలు లేకుండా.. సహకారం లేకుండా.. ఈ రాష్ట్రంలో వందల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ నిర్మించుకోగలమా?’ అని ప్రశ్నించారు ఈటల రాజేందర్.
పూర్తిగా చదవండి..Etela Rajender: సీఎం కేసీఆర్ టార్గెట్‌గా సంచలన కామెంట్స్ చేసిన ఈటల రాజేందర్..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తున్న తీరును చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని అన్నారు.

Translate this News:











