టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ అక్టోబర్ 3కు వాయిదా పడింది. తొలుత జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ వెంకట నారాయణ భట్టిలతో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు రాగా.. నాట్ బిఫోర్ మీ అని విచారణకు న్యాయమూర్తి భట్టి విముఖత వ్యక్తం చేశారు. దీంతో క్వాష్ పిటిషన్‌ను సీజేఐ చంద్రచూడ్ ముందు చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా మెన్షన్ చేశారు. తక్షణమే లిస్టింగ్ చేయాలని తమ మొదటి అభ్యర్థన అని.. మధ్యంతర బెయిల్ అనేది రెండో అభ్యర్థన అని లూథ్రా తెలిపారు. 17ఏ కేసు మూలాల గురించి చర్చించాల్సిన అంశం ఉందని అభిప్రాయపడ్డారు. జడ్ క్యాటరిగీ, ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని ఇలా ట్రీట్ చేస్తారా అని వాదించారు. లూథ్రా వాదనలు విన్న సీజేఐ తదుపరి విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేశారు.
పూర్తిగా చదవండి..Breaking: సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ అక్టోబర్ 3కు వాయిదా
టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్‌లతో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు రాగా.. విచారణకు భట్ విముఖత వ్యక్తం చేశారు. దీంతో ఈ కేసు మరో బెంచ్‌కు బదిలీ అయింది. వరుస సెలవుల నేపథ్యంలో వచ్చే వారం విచారణ చేపట్టే అవకాశం ఉంది.

Translate this News:











