విజయవాడలో బుధవారం మంత్రి ఆర్కే రోజా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ రాష్ట్రపతిని కలిసి తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని కోరుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం లోకేష్ (TDP Leader Nara lokesh) ఎప్పుడైనా రాష్ట్రపతిని కలిశారా? అని ప్రశ్నించారు. అలాంటి దాఖలాలే లేవని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ము దోచేసినా చర్యలు తీసుకోకూడదంట అంటూ ఎద్దేవా చేశారు. లోకేష్ ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ( (PM Modi), అమిత్షా (Amit shah) కాళ్ళు పట్టుకోవడానికి తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. అడ్డంగా దొరికిన చంద్రబాబును కాపాడేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. అందుకే మోదీ, అమిత్షా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు స్కిల్ డెవెలప్మెంట్ సహా అమరావతి, ఫైబర్ నెట్ వంటి అనేక స్కాంలు చేశారని రోజా (Minister RK Roja) గుర్తు చేశారు.
పూర్తిగా చదవండి..Minister Roja: లోకేష్ ఎప్పుడైనా అలా చేశావా?: మంత్రి రోజా సంచలన వాఖ్యలు
టీడీపీ నేత నారా లోకేశ్ కలిసి తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని రాష్ట్రపతిని కోరారని మంత్రి రోజా అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం లోకేశ్ రాష్ట్రపతిని కలిసిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. ప్రజల సొమ్ము దోచేసినా చర్యలు తీసుకోకూడదంట అంటూ ఎద్దేవా చేశారు.

Translate this News:











