Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత ఈక్వెస్ట్రియన్ జట్టు (Equestrian) అద్భుతం చేసింది. 41 ఏళ్ల తర్వాత గుర్రపు పందేల్లో తొలి పతకం అందుకుంది. డ్రెసేజ్ విభాగంలో ఏకంగా స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. ఆతిథ్య చైనాను వెనక్కి నెట్టింది. హృదయ్ చెడ్డా (Hriday Chheda), దివ్యకృతి సింగ్ (Divyakriti Singh), అనుష అగర్వాల(Anush Agarwalla), సుదీప్తి హజేలా(Sudipti Hajela)తో కూడిన జట్టు 209.205 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. చైనా (204.882 పాయింట్లు), హాంకాంగ్ (204.852 పాయింట్లు)ను రజతం, కాంస్యానికి పరిమితం చేసింది. ఆసియా క్రీడల్లో ఈక్వస్ట్రియన్ విభాగంలో భారత్కు ఇది నాలుగో బంగారు పతకం. అంతకు ముందు మూడు స్వర్ణ పతకాలను 1982 ఆసియా క్రీడల్లో గెలుచుకుంది.
పూర్తిగా చదవండి..Asian Games: ఈక్వెస్ట్రియన్ పోటీల్లో భారత్ రికార్డు.. 41ఏళ్ల తర్వాత స్వర్ణం
ఆసియా క్రీడల్లో భారత ఈక్వెస్ట్రియన్ జట్టు అద్భుతం చేసింది. 41 ఏళ్ల తర్వాత గుర్రపు పందేల్లో తొలి పతకం అందుకుంది. డ్రెసేజ్ విభాగంలో ఏకంగా స్వర్ణ పతకాన్ని ముద్దాడింది.

Translate this News:











