ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న రేయాన్ష్ కొంతకాలంగా ఆన్లైన్ గేమ్స్‌కు బానిస అయ్యాడు. దీంతో ఆతడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం పీయస్ పరిధిలోని మైహోమ్ భూజాలోఈ ఘటన చోటుచేసుకుంది. మైహోమ్ భూజా జే బ్లాక్‌పై నుంచి దూకి విద్యార్థి రేయాన్ష్‌రెడ్డి (14) ఆత్మహత్య చేసుకోవటంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. దీంతో అందరు ఒక్కసారిగా ఆందోళనకు గురి అయ్యారు. ఆన్ లైన్ గేమ్స్‌కు బానిస కావడంతో పాటు.. చదువులో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Sad News: ఆగం చేసిన ఆన్లైన్ గేమ్.. అపార్ట్మెంట్ పై నుంచి దూకిన టెన్త్ స్టూడెంట్.. అసలేమైందంటే?
ప్రస్తుత టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. టెక్నాలజీ అభివృద్ధి చెందటం వల్ల ఎన్నో ఉపయోగాలతో పాటు కాదు దానికి మించిన దుష్ప్రభావాలు ఉన్నాయి. ఈ కాలంలో స్కూల్‌కు వెళ్ళే పిల్లల దగ్గర ఫోన్లో వాడకం పెరిగింది. ఈ క్రమంలో ఆన్లైన్ గేమ్స్‌కి బానిసై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది.

Translate this News:











