ప్రతి మనిషి ఉదయాన్నే కప్పు టీ తాగకుండా ఉండలేడు. అంతేకాదు వారి రోజును ప్రారంభించడం కూడా కష్టంగానే ఉంటుంది. అయితే ఈ అలవాటు శరీరానికి ఎంత మేలు చేస్తుంది..? బరువు తగ్గాలనుకునే వారు ముఖ్యంగా టీ అస్సలు తాగొద్దా..? డైటీషియన్ మాక్ సింగ్ అన్ని ప్రశ్నలకు సమాధానమిస్తున్నారు. మిల్క్ టీ తాగటం అంత మంచిది కాదంటున్నారు. టీలో కొవ్వు , కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడే కొన్ని సమ్మేళనాలు ఉన్నాయి. అయితే.. టీలో పాలు కలపడం వల్ల కొవ్వు తగ్గే ప్రక్రియ నిరోధిస్తుంది. కాగా పాల టీలో చక్కెర కలుపుకుని చాలామంది తాగుతారు.. కానీ.. అధిక చక్కెర బరువు తగ్గడానికి ఆటంకం కలిగిస్తుందని చెబుతున్నారు. చక్కెర మిల్క్ టీని రోజుకు చాలాసార్లు తాగడం వల్ల కేలరీలను పెంచుతోంది. ఈ టీతో స్నాక్స్ లేకుండా చాలా మంది ఉండలేరు. ఇలా టీతో వేయించిన లేదా ఇతర అనారోగ్యకరమైన ఆహారాన్ని తింటే బరువు పెరగడానికి దారితీస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అయితే టీలో పాలు కలపడం వల్ల టీలోని పోషకాలు శరీరంలోకి చేరకుండా నిరోధిస్తుంది. ఫలితంగా, పాలు లేకుండా టీ తాగడం మంచిదంటున్నారు.
పూర్తిగా చదవండి..Health Tips: ఉదయాన్ని టీ తాగితే డేంజర్.. ఏమవుతుందో తెలిస్తే షాకవుతారు!
చాలామందికి పొద్దున్నే లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. ఈ టీని ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా..? అయితే అనేక రోగాలకు ఆహ్వానం పలికినట్లే అని వైద్యులు చెబుతున్నారు. చాలామంది ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో వేడి వేడి టీ తాగేస్తుంటారు. కనీసం గ్లాస్ నీరు కడుపులో వేయకుండా టీ తాగేస్తారు. అయితే ఈ అలవాటు మంచిది కాదంటున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు టీ అస్సలు తాగకూడదు.. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

Translate this News:











