Swara Bhaskar: బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా బిడ్డతో కలిసి ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు స్వరా దంపతులు. ఈ నెల 23న తమకు కూతురు జన్మించారని.. బేబి పేరు రబియాగా నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. స్వర దంపతులకు బిడ్డ జన్మించిన నేపథ్యంలో అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా జనవరి 6, 2023న సమాజ్ వాదీ పార్టీ నేత ఫహాద్ జిరార్ అహ్మద్‌ను స్వరా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత కోర్టు ద్వారా రహస్య వివాహం చేసుకుని.. ఆ తర్వాత మార్చిలో మరోసారి పెళ్లి చేసుకున్నారు. అనంతరం మూడు నెలలకే గర్భం దాల్చినట్లు ఆమె ప్రకటించారు. ‘కొన్నిసార్లు మన ప్రార్థనలు అన్నీ ఫలిస్తాయి. భగవంతుడు మన ప్రార్థనలకు సమాధానం ఇస్తారు. మేం కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాం. ఇదొక గొప్ప అనుభూతి. చాలా ఆతృతగా ఉన్నాం” అని భర్తతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
పూర్తిగా చదవండి..Swara Bhaskar: పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి స్వరా భాస్కర్
బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ పండండి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా బిడ్డతో కలిసి ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు స్వరా దంపతులు. ఈ నెల 23న తమకు కూతురు జన్మించారని.. బేబి పేరు రబియాగా నామకరణం చేసినట్లు పేర్కొన్నారు.

Translate this News:











