BhavyaSri: చిత్తూరు జిల్లా పెనుమూరులో ఇంటర్ విద్యార్థిని భవ్య అనుమానస్పద మృతి కేసు మిస్టరీగా మారింది. కావూరివారిపల్లె పంచాయతీ, ఠాణా వేణుగోపాలపురంకి చెందిన భవ్యశ్రీ ఈనెల 17వ తేది రాత్రి అదృశ్యమైంది. 18వ తేదీ యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదుచేశారు. 20వ తేదీన గ్రామంలో వినాయక నిమజ్జనం చేస్తుండగా చెరువులో భవ్యశ్రీ శవమై కనిపించింది. బాలిక మృతదేహం చూసిన కొందరు యువకులు కేకలు వేస్తూ గ్రామస్తులకు విషయం చెప్పారు. దీంతో అందరూ బావి దగ్గరకు చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి బావిలోని విద్యార్థిని డెడ్ బాడీని బయటకు తీశారు. ఆ మృతదేహం భవ్యశ్రీదిగా గుర్తించారు. కుమార్తె చనిపోయిందని తెలిసి… భవ్యశ్రీ కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమెకు అర్థ శిరోముండనం చేసి, కనురెప్పలు కత్తిరించి ఉరివేసి చంపేసిన తర్వాత బావిలో పడేశారని బంధువులు ఆరోపిస్తున్నారు.
పూర్తిగా చదవండి..BhavyaSri: మిస్టరీగా మారిన ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ దారుణ హత్య
చిత్తూరు జిల్లా పెనుమూరులో ఇంటర్ విద్యార్థిని భవ్య అనుమానస్పద మృతి కేసు మిస్టరీగా మారింది. కావూరివారిపల్లె పంచాయతీ, ఠాణా వేణుగోపాలపురంకి చెందిన భవ్యశ్రీ ఈనెల 17వ తేది రాత్రి అదృశ్యమైంది. 18వ తేదీ యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదుచేశారు.

Translate this News:











