Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యాంపస్‌లోని ఐకానిక్ ఆర్ట్స్ కాలేజీ ఎదుట కేక్ కట్ చేయడం నిషేధిస్తునట్టు ప్రకటించారు. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీని పర్యాటక ప్రాంతంగా గుర్తించడంతో.. కేక్ కటింగ్ వల్ల వచ్చే చెత్తతో పర్యాటకులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అర్థరాత్రి పూట ఆలస్యం కళాశాల భవనం ముందు కేక్‌లు కట్ చేయడం అనంతరం అక్కడ చెత్త వేయడం వంటివి చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే మహిళా విద్యార్థులు కూడా అర్థరాత్రి పూట జరిగే ఈ వేడుకల్లో పాల్గొంటున్నారని.. వారి భద్రతపై ఆందోళనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో కేక్ కటింగ్స్ బంద్

Translate this News:











