గ్రూప్-1 పరీక్షలు మళ్లీ వాయిదా పడటంపై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి గారి ప్రకటన చేశారు. కేసీఆర్ ప్రభుత్వ అసమర్థ ప్రజాపాలన, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం కారణంగా.. వరుసగా రెండోసారి రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా పడటం దురదృష్టకరం అన్నారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 4 లక్షల మంది యువతలో నైరాశ్యం నింపేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో.. నీళ్లు, నిధుల విషయంలో ఎలాగూ దగాపడుతున్నాం. ఇప్పుడు నియామకాల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం యువతకు శాపంగా మారిందన్నారు. ఇటీవలే జరిగిన పేపర్ లీక్ ఘటన ఈ సందర్భంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం కాస్తయినా జాగ్రత్తగా వ్యవహరిస్తోందనుకుంటే.. మళ్లీ అదే అసమర్థత, అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..Tspsc : గ్రూప్-1 పరీక్ష రద్దు.. కిషన్రెడ్డి, ఈటలతో పాటు ఇతర నేతల రియాక్షన్ ఇదే!
తెలంగాణలో పరీక్షల రద్దు అంశం మళ్లీ తెరమీదకొచ్చింది. రాష్ట్రంలో ఎంతో ప్రతీష్టాత్మకంగా నిర్వహించిన టీఎస్పీఎస్సీ గ్రూప్-1 పరీక్ష మళ్లీ రద్దు అయింది. తాజాగా దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

Translate this News:











