ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు వరకూ వెళ్ళింది. ఏసీబీ కోర్టులో తేలలేదు…హైకోర్టు కూడా క్వాష్ పిటిషన్ ను కొట్టేసింది. ఇప్పటికే చాలా దర్యాప్తు జరిగింది…ఇప్పడు దీనిపై తాము ఎలా విచారిస్తాము…అందుకే కేసును కొట్టేస్తున్నామని హైకోర్టు చెప్పింది. దీనిని సవాలు చేస్తు చంద్రబాబు తరుఫు లాయర్లు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..chandrababu:సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్
చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా నిన్న పెట్టిన ట్వీట్ కు అర్ధమేమిటో ఈరోజు తెలిసింది. ఏసీబీ కోర్టు, హైకోర్టులలో తేలకపోతే ఏమయింది సుప్రీంకోర్టు ఉందిగా అంటున్నారు.స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాబు వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఇప్పుడు ఆ తీర్పును సవాలు చేస్తూ బాబు లాయర్లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Translate this News:











